విశాఖపట్నంలో కొలువైన సిరులతల్లి శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారికి శ్రీవారి తరఫున శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రమేష్‌బాబు గురువారం పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి అమ్మవారి ఆలయ ఈవో శ్రీమతి ఎస్.జ్యోతిమాధవి స్వాగతం పలికి శ్రీవారి సారెను అమ్మవారి వద్ద వుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
త్వరలో ప్రారంభం కానున్న మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి టిటిడి సారె అందించింది. 10 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీకనక మహాలక్ష్మీ అమ్మవారికి టిటిడి పట్టు వస్త్రాలు సమర్పిస్తోంది. అమ్మవారి ఆలయంలో మార్గశిరమాసంలో నెల రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.