వైకుంఠ ద్వాదశికి రూ.300/- టికెట్ల ఆన్‌లైన్‌ కోటా 5,000


భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వాదశి పర్వదినం, ఆంగ్ల నూతన సంవ్సరాది సందర్భంగా టిటిడి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నవంబరు 25వ తేదీ ఉదయం 10.00 గంటలకు టిటిడి వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది.

డిసెంబరు 30వ తేదీ వైకుంఠ ద్వాదశి పర్వాదినాన 5 వేలు, ఆంగ్ల నూతన సంవత్సరాది 1 జనవరి 2018కి 10 వేలు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టిటిడి భక్తులకు ఆన్‌లైన్‌లో కేటాయించనుంది.

ఈ కోటా ఇంటర్‌నెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. టిటిడి వెబ్‌సైట్‌ www.ttdsevaonline.com లో భక్తులు టికెట్లు పొందవచ్చు.

ఇ-దర్శన్‌ కౌంటర్లు, కరంట్‌ బుకింగ్‌, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.