టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో నవంబరు 4 నుంచి 15వ తేదీ వరకు శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
శ్రీకాకుళంలో
- నవంబరు 4వ తేదీన బూర్జ మండలం తోటవాడ ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- నవంబరు 5న కవిటి మండలం కుసుమపురంలోని మండల పరిషత్ పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
- నవంబరు 6న లవరు మండలంలోని బెజ్జిపురంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
- నవంబరు 7న గార మండలం శ్రీకూర్మంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- నవంబరు 8న సంతకవిటి మండలం మందరాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
కృష్ణాలో
- నవంబరు 10న నాగాయలంక తలగడదీవి ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- నవంబరు 13న చల్లపల్లి మండలం నందెళ్లవారిపాళెం ఎస్‌సి కాలనీలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
- నవంబరు 14న కొద్దూరు మండలంలోని వి.కొత్తపాళెం ఎస్‌సి కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
- నవంబరు 15న బంతుమిల్లి మండలం బర్రిపాడు ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.