శ్రీ కపిలేశ్వరాలయంలో వినాయకచవితి పర్వదినం


టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శుక్రవారం వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. 


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపట్టారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు శ్రీవినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అదేవిధంగా, రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీవినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.