ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారిదర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.
ఇందులో భాగంగా సెప్టెంబర్ 13, 20వ తేదీలలో వయోవృద్ధులు (65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10.00 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు, మధ్యాహ్నం 2.00 గంటలకు 2 వేల టోకెన్లు జారీ చేయనున్నారు.
5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను సెప్టెంబర్ 14, 21వ తేదీలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.
Source