తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం 3.30 గంటల నుంచే సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఆగస్టు 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని మూసివేసిన విషయం విదితమే.
మంగళవారం వేకువజామున 2 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అష్టదళ పాదపద్మారాధన అనంతరం నిర్దేశించిన సమయానికంటే ముందుగానే భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.