గరికతో గణనాధుని పూజిస్తే అన్నీ శుభాలే

విఘ్నశ్వరుడు విఘ్నాలకు అధిపతి. ఆయనను స్మరించనిదే మనం ఏ కార్యమూ తలపెట్టం. అందుకు పెద్ద పండుగలను మనం వినాయక చవితితో ఆరంభించుకుంటాం. ఏ పనినైనా తలపెట్టేముందు. విఘ్నధిపతిని పూజిస్తే ఆ సంవత్సరం అంతా మనం చేపట్టే పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని మన నమ్మకం. అలాంటిది వినాయకునికి ప్రీతి పాత్రమైన పూజా ద్రవ్యాలతో ఆయనను పూజిస్తే మరి ఆయన కరుణా కటాక్షాలు మనపై ప్రసరించవా మరి.

వినాయకుని పూజించేందుకు వినియోగించే ఇరవై ఒక్క రకాల పత్రాలలోను ''గరిక (గడ్డి)'' అంటే అంటే విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం. ఈ గరికతో గణనాధుని పూజించే దూర్వాగణపతి వ్రతం జూలై 26న. అంటే శ్రావణ శుద్ధ తదియ నాడు ఈ వ్రతం చేసుకుంటే అన్నీ శుభాలే కలుగుతాయి.

ఇదీ వ్రతం వెనుక కధ


దూర్వం అంటే గరిక. గణపతికి గరిక అంటే ఇష్టం గనుక దూర్వా గణపతి అని కూడా స్వామిని పిలుస్తాం. యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు. ఈయన అగ్ని సంబంధమైన తేజస్సు తో జన్మించాడు. అందువల్ల ఆయన శరీరము నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి. అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్ధిచాడు. గణపతి అనలాసురుడిని తన బొటన వ్రేలితో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు. అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడంవల్ల విఘ్నేశ్వరుని ఉదరములో అమితమైన వేడి పుట్టింది.

దాంతో ఆయన బొజ్జలో వివరీతమైన తాపము పుట్టింది. దేవతలు ఆయన భాదను చూడలేక నీటితోను, అమృతం తోను ఎంత అభిషేకించినా ప్రయోజనం లేకపోయింది. నివారణ కోసము ఈశ్వరుని ప్రార్ధించగా.... అప్పుడు పరమేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నశ్వరుని పూజింపమని సూచిస్తాడు. సంస్కృతములో గరికను ''దూర్వలం'' అంటారు . శివుడు ఇచ్చిన పరిష్కారంతో గణపతి తాపము వెంటనే చల్లారిపోయింది .

గరికతో గణనాధుని పూజిస్తే అన్నీ శుభాలే

వ్రతం ఇలా చేసుకోండి... విఘ్నేశ్వరునికి గరిక (గడ్డి) పత్రం అంటే మహాప్రీతి. శ్రావణ శుద్ధ తదియ రోజున దూర్వా గణపతి వ్రతం చేసుకోవాలి. స్వామిని గరికతో ఈ క్రింది 21 నామాలతో పూజించి, 21 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. దూర్వాగణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సుఖసౌఖ్యాలు.. శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

  • ఓం గజననాయ నమః

  • ఓం గణపతయే నమః

  • ఓం హేరంబాయ నమః

  • ఓం ధరణీ ధరాయ నమః

  • ఓం మహా గణపతయా నమః

  • ఓం సర్వసిద్ది ప్రదాయ నమః

  • ఓం క్షిప్రప్రసాదనాయ నమః

  • ఓం అమోఘ సిద్దియే నమః

  • ఓం అమితాయ నమః

  • ఓం మంత్రాయ నమః

  • ఓం చింతామణయే నమః

  • ఓం నిధయే నమః

  • ఓం సుమంగళాయ నమః

  • ఓం బీజాయ నమః

  • ఓం ఆశాపూరకాయ నమః

  • ఓం వరదాయ నమః

  • ఓం శివాయ నమః

  • ఓం శాక్యపాయ నమః

  • ఓం పార్వతీనందాయ నమః

  • ఓం వాక్యతయే నమః

  • ఓం ఢుంఢి వినాయకాయ నమః