ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అంటారు. ఆరోజున శ్రీమహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్లి, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. మనం భోగాలను వదిలి యోగం వైపు దృష్టి నిలపాలని దీనర్థం. ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తల పెట్టక ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుంచి హిందూ దేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్థం. కొందరు అర్థచాతుర్మాస్యం అనే పేరుతో రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటిస్తున్నారు. ఈ వ్రతాచరణకు స్త్రీ, పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదంటున్నారు మన పెద్దలు.
అందరూ అర్హులే...
ఈ వ్రతాన్ని వితంతువులైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని హిందువుల తోపాటు జైన, బౌద్ధ మతస్థులు వారి వారి ప్రాంతాల్లో కూడా ఆచరించడం కనిపిస్తుంది. ఈ వ్రతాచరణ ముఖ్య ఉద్దేశ్యం ఆచరించే వారి కుటుంబ, వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు, సమాజ శ్రేయస్సు కూడా ఇతోధికంగా ముడిపడి ఉంటుంది. ఆషాఢం నుంచి నాలుగు నెలలు వర్షాలు బాగా పడు తుంటాయి. ఇలాంటి తేమ వాతావరణం వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిముల వ్యాప్తికి అనువుగా ఉంటుంది. చాతుర్మాస్య వ్రతంలో పాటించే ఆహార, విహారాది నియమాల ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.ఒక్కో ఋతువుకు ఒక్కో యజ్ఞం..
ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించడమనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. యుగయుగాలుగా ఆచరణలో ఉందని మన పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఒకప్పుడు నాలుగు నెలలపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట. అనంతర కాలంలో రెండేసి నెలలపాటు ఉండే ఆరు ఋతువులుగా మారాయి. తొలినాళ్లలో వర్ష, హేమంత, వసంత అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష రుతువుతోనే సంవత్సరం ఆరంభమవుతూ ఉండేది. ఈ కారణం వల్లే సంవత్సరానికి 'వర్షం' అనే పేరు వచ్చింది. సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలంలో ఒక్కో ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు. ఆషాడ పూర్ణిమ నుంచి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుంచి సాకమేద యజ్ఞం, ఫాల్గుణ నుంచి వైశ్వ దేవయజ్ఞం చేస్తూ ఉండేవారు.నాటి అషాడ యజ్ఞం నేడు...
ఆలనాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే తర్వాత కాలంలో చాతుర్మాస్య వ్రతంగా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. చాతుర్మాస వ్రతం పాటించేవారు ఆహార నియమాల్లో భాగంగా శ్రావణ మాసంలో ఆకు కూరలను, బాధ్రపద మాసంలో పెరుగును అశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలిపెట్టాలి. వాటిని ఏమాత్రం ఆహారంగా తీసుకోకూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చు. ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస వ్రతదీక్ష అనేది మాన వాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని తెలుస్తోంది.ఆ నాలుగు ఏకాదశులు...
ఆషాఢ, శ్రావణ, భాద్రపద, అశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. ఈ నాలుగు నెలలు సాధకులు భూశయనం చేయడం, ఆకు కూరలు, వెల్లుల్లి, సొరకాయ, టమాట, ఆవ నూనెల సేవనం మానివేయడం, నిరంతర జప, తప, హోమ, పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపడం, రోజూ ఒకే పూట భోజనం చేయడం, ఏకాదశుల్లో పూర్తిగా ఉపవాస దీక్ష చేయడం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. ఈ చాతుర్మాస నియమాను సారం చేసే సాధన వల్ల సాధకులకు శారీరక, ఆధ్మాత్మిక మేలు అపారంగా జరుగుతుంది. నాలుక విపరీతంగా రుచులను కోరుకుంటుంది. నాలుక ఎంతగా రుచులను కోరుకుంటుందో మనసు అంతలా చంచలమైపోతుంది.మనసును ఎప్పుడైతే అచంచలం చేయగలుగుతామో ఎప్పుడైతే మానవ పాంచభౌతిక శరీరం శుద్ధవుతుందో అప్పుడు పంచేంద్రియాలకు అవతలివైపు అనుభూతికి దొరికే దైవాన్ని దర్శించగలుగుతాం. ఆ పంచేంద్రియాలకు ఆవల దర్శనమయ్యే విషయాన్ని కొందరు శక్తి అంటున్నారు. మరికొందరు దైవం అంటున్నారు.
ఎవరెన్ని పేర్లు పెట్టినా అందరి లక్ష్యం ఆస్థితిని అనుభూతి చెందడమే
ఈ నేపధ్యంలోనే అనేక వ్రతాలు, నోములు, పూజలు, అనేకానేక దైవిక కార్యక్రమాలు వాటిని నిర్వర్తించే తంతులు మనకు నిర్వచించ బడ్డాయి. ఈ జన్మలో మనం వాటిని నియమ బద్ధంగా ఆచరిస్తూ దైవానుగ్రహాన్ని పొందాలి.
ఇలాంటి వాటిలో 'చాతుర్మాస్య వ్రతం' ఒకటి. జూలై 5 నుంచి ఈ వ్రతం ఆచరించేందుకు పెద్దలు నిర్దేశించారు. ఆ వ్రత విశేషాలు తెలుసుకుందాం.
మనసును ఎప్పుడైతే అచంచలం చేయగలుగు తామో అప్పుడు దైవ ధ్యానం అద్భుతంగా చేయగలుగుతాం. అందుకోసం పూర్వం మునులు, యోగులు ఆషాఢంలో చేసే యజ్ఞమే తర్వాత కాలంలో చాతుర్మాస్య వ్రతంగా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు.
చాతుర్మాస్య వత్రం చేసేవారు ఈ నాలుగు నెలలు సరిగ్గా వ్రత నియమాలను ఆచరిస్తే పంచభూతాత్మకమైన మానవ శరీరం శుద్ధి అవుతుంది.
ఎప్పుడైతే మానవ పాంచభౌతిక శరీరం శుద్ధవుతుందో అప్పుడు పంచేంద్రియాలకు అవతలివైపు అనుభూతికి దొరికే దైవాన్ని దర్శించగలుగుతాం. చాతుర్మాస వ్రత దీక్ష అనేది మాన వాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణాలు చెబుతున్నాయి
అప్పుడు దైవ ధ్యానం అద్భుతంగా చేయగలుగుతాం. ఆ చంచల త్వాన్ని తగ్గించడం కోసం చాతుర్మాసంలో ఒక్కపూట భోజనం చేయాల్సి ఉంటుంది. ఈ నియమాలు పీఠాధిపతులు చేయవలసిన అవసరం ఏంటి? అంటే లోకం లో జ్ఞానులైన వారినే సాధారణ జనం అనుసరిస్తారు. కనుక సామాన్య జనాన్ని ఉద్ధరించాలనే ఏకైక లక్ష్యంతో, ప్రేమతో సాధు సంతులు, పీఠాధిపతులు నిష్కల్మషంగా చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
అందరి లక్ష్యం ఒక్కటే...
ఈ నాలుగు నెలలు సాధకుడు సరిగ్గా వ్రత నియమాలను ఆచరిస్తే పంచభూతాత్మకమైన మానవ శరీరం శుద్ధి అవుతుంది. మన ఋషుల వాక్కులు అమత వాక్కులు. అవి మానవోద్ధరణకు సూచించిన మార్గదర్శకాలు. చాతుర్మాసంలో చేసే ఈ వ్రతం మళ్లీ చాతుర్మాసం వచ్చేవరకూ కావలసిన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆధ్మాత్మికంగా ముందుకు వెళ్లగలుగుతాం. ఆరోగ్యం, ఆధ్మాత్మికం రెండూ ఒకే పెట్టున గాడిలో పడడానికి ఈ వ్రతం మనకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ నాలుగు నెలలు చేసే ఈ సాధన మన జీవితాల్లో పరిపక్వతను తీసుకువస్తుంది.