చంద్ర గ్రహణం కారణంగా ఆగస్టులో శ్రీవారి ఆలయంమూత

చంద్రగ్రహణం కారణంగా ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 4.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 2 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.

ఆగస్టు 7వ తేదీన రాత్రి 10.52 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఆగస్టు 8న ఉదయం 12.48 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఆగస్టు 8న ఉదయం 2 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అష్టదళ పాదపద్మారాధన అనంతరం ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

ఆగస్టు 7న ఆర్జిత సేవలు రద్దు

చంద్రగ్రహణం కారణంగా ఆగస్టు 7వ తేదీన సోమవారం విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

Source