పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల |
దేశంలోని వైష్టవ క్షేత్రాలన్నింటిలో తమిళనాడు రాజధానికి చెన్నైకి సమీపంలోని శ్రీ పెరుంబుదూరులో ఉన్న శ్రీ ఆదికేశవ ఎంబెరుమన్నార్ స్వామివారి దేవాలయం చాలా ప్రశస్తమైనది.
ప్రసన్నాగ్రేసర పుప్పల రమణప్పనాయుడు అనే భక్తుడు తన గురువుగారైన ఈయుణ్ణి రామానుజా చార్యుల ఆదేశానుసారం, ఆయన కోరికను తీర్చే నిమిత్తం నరసాపురంలో కూడా శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ ఈ ఆలయాన్ని కట్టించారని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల |
ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆదికేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు, రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాలనుండి చాలామంది వైష్ణవ గురువులు, భక్తులు తరలి వస్తారు. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఆదికేశవుల అనుగ్రహానికి పాత్రులవుతారు కదూ...
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెలలో ఆళ్వారుల విగ్రహాలు |
నరసాపురం వెళ్లాలంటే విజయవాడ నుండి రైలు, బస్సు సదుపాయం ఉంది. అలాగే ఏలూరు నుంచి ఎక్కువగా నరసాపురం బస్సులు తిరుగుతాయి. కాకినాడ, రాజమండ్రి నగరాలనుంచి కూడా విరివిగా బస్సులు తిరుగుతాయి. జాతీయ రహదారిలో ఉండే తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి ప్రతి 30 నిముషాలకు ఒక బస్సు ఉంటుంది.
స్థానికంగా ఈ ఆలయం కోవెల గుడిగా పేరుపొందింది. శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ కోవెలగా పేర్కొంటారు. ఇక్కడ కొలువై ఉన్న కేశవుడు భక్తలు కోరిన కోర్కెలు తీరుస్తాడని... జీవితంలోని భయాలు... బాధలు పటాపంచలు చేస్తాడని ప్రజల నమ్మకం.