శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరణ

శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 4 నుండి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం (అభిధేయక అభిషేకం) గోడపత్రికలను శనివారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇందులో స్వామివారి స్వర్ణకవచాలకు జూలై 4న కవచాధివాసం, జూలై 5న కవచ ప్రతిష్ఠ, జూలై 6న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం చేపడతారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం శతకలశస్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్టా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.

Source