టిటిడికి అనుబంధంగా వున్న వైఎస్ఆర్ కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీచెన్నకేశవస్వామివారు, శ్రీసిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని జెఈవో కార్యాలయంలో బుధవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భగా జెఈవో మాట్లాడుతూ జూలై 4 నుండి 12వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీచెన్నకేశవస్వామివారు, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 3వ తేదీ సోమవారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి వాహనసేవలలో పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ చెన్నకేశవస్వామివారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు వివరాలు :
- 04-07-2017(మంగళవారం) ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం చిన్న శేష వాహనం
- 05-07-2017(బుధవారం)ఉదయం పల్లకీసేవ, సాయంత్రం హంస వాహనం
- 06-07-2017(గురువారం) ఉదయం పల్లకీసేవ, సాయంత్రం సింహావాహనం
- 07-07-2017(శుక్రవారం) ఉదయం పల్లకీసేవ, సాయంత్రం హనుమంత వాహనం
- 08-07-2017(శనివారం) ఉదయం పల్లకీసేవ శిఖర దీపారాధనం, సాయంత్రం గరుడ వాహనం
- 09-07-2017(ఆదివారం) ఉదయం ఆర్జిత కల్యాణోత్సవం, సాయంత్రం గజవాహనం
- 10-07-2017(సోమవారం) ఉదయం రథోత్సవం
- 11-07-2017(మంగళవారం) ఉదయం అశ్వవాహనం
- 12-07-2017(బుధవారం) ఉదయం వసంతోత్సవం, ధ్వజావరోహణం
శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బహ్మోత్సవాల్లో వాహనసేవలు వివరాలు
- 04-07-2017(మంగళవారం) ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం హంస వాహనం
- 05-07-2017(బుధవారం) ఉదయం పల్లకీసేవ, సాయంత్రం చంద్రప్రభ వాహనం
- 06-07-2017(గురువారం) ఉదయం పల్లకీసేవ, సాయంత్రం చిన్నశేషవాహనం
- 07-07-2017(శుక్రవారం) ఉదయం పల్లకీసేవ, సాయంత్రం సింహ వాహనం
- 08-07-2017(శనివారం) ఉదయం పల్లకీసేవ శిఖర దీపారాధనం, సాయంత్రం నందివాహనం
- 09-07-2017(ఆదివారం) ఉదయం ఆర్జిత కల్యాణోత్సవం, సాయంత్రం గజవాహనం
- 10-07-2017(సోమవారం)పల్లకీసేవ
- 11-07-2017(మంగళవారం) పార్వేటి ఉత్సవం
- 12-07-2017(బుధవారం) ఉదయం వసంతోత్సవం, ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాలలో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Source