అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్‌లో శ్రీవారి సేవకులకు ప్రాణాయామంలో శిక్షణను ప్రారంభించారు. సేవకుల్లో ఏకాగ్రతను పెంచి మరింత మెరుగ్గా భక్తులకు సేవలందించేందుకు వీలుగా ప్రాణాయామంలో శిక్షణ ఇచ్చారు.
టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సూచనల మేరకు ఇకపై ప్రతిరోజూ శ్రీవారి సేవకులకు ప్రాణాయామంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇదివరకే శ్రీ సత్యసాయి సేవా సంస్థ సహకారంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సేవకులకు సత్సంగం, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Source