శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు ‘శ్రీవారి సేవ’ ఆన్‌లైన్‌ స్లాట్‌ విడుదల



తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో ఈ ఉత్సవాల రోజుల్లో భక్తులకు సేవలందించేందుకు ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవ స్లాట్‌ను గురువారం టిటిడి విడుదల చేసింది. సెప్టెంబర్‌ 22వ తేదీ నాటికి 1000 మంది, 23వ తేదీ నాటికి 1000 మంది చొప్పున బుక్‌ చేసుకునేందుకు వీలుగా స్లాట్లను అందుబాటులో ఉంచారు. షషష.్‌ఱతీబఎaశ్రీa.శీతీస్త్ర వెబ్‌సైట్‌ ద్వారా శ్రీవారి సేవకులు స్లాట్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో స్లాట్‌ను బుక్‌ చేసుకున్న శ్రీవారి సేవకులు 11 రోజుల పాటు తిరుమలలో భక్తులకు సేవలు అందించాల్సి ఉంటుంది. 10 నుంచి 15 మంది భక్తులు ఒక బృందంగా ఏర్పడి తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆధార్‌ కార్డు నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌ను తప్పనిసరిగా పొందుపరచాలి. 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న హిందూమతానికి చెందిన వారు మాత్రమే నమోదు చేసుకోవాలి. కొత్తగా నమోదు చేసుకునే శ్రీవారి సేవకులు వెబ్‌సైట్‌లో న్యూ యూజర్‌ అనే బటన్‌ను క్లిక్‌ చేసి రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

శ్రీవారి సేవకు విచ్చేసే పురుషులు తెలుపు రంగు వస్త్రాలు, మహిళలు మెరూన్‌ బార్డర్‌తో కూడిన ఆరంజ్‌ కలర్‌ చీర, మెరూన్‌ రవికె ధరించాల్సి ఉంటుంది. శ్రీవారి సేవకులు తమ వెంట చిన్నపిల్లలను, వృద్ధులను, వ్యాధిగ్రస్తులను తీసుకురాకూడదు. సేవా విధుల ఆఖరి రోజున శ్రీవారిసేవకులకు రాయితీపై శ్రీవారి లడ్డూ ప్రసాదం అందజేస్తారు.

Source