టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కళాశాల మైదానంలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.
కార్యక్రమంలో భాగంగా మొదట ఒక గంట పాటు యోగా ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత యోగా విశిష్టతపై తిరుపతిలోని శ్రీ రామకృష్ణ మఠం, విశాఖపట్నంకు చెందిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు ఉపన్యసిస్తారు.
ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. శంకర్ బాబు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Source