ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

 

ఏకశిలానగరం ఒంటిమిట్ట కోదండరామాలయంలో బుధవారం సాయంత్రం 6. 30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

  • కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 121 గ్యాలరీలలో 60 వేల‌ మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు.
  • ప్రతి గ్యాలరీలో భక్తులకు సకాలంలో సేవలు అందెలా పారా మెడికల్ సిబ్బంది, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు.
  • కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 28 కియోస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశారు.
  • కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల‌ తలంబ్రాలు, శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం, కంక‌ణం, అన్నప్రసాదాలు అందించనున్నారు.
  • నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు. ఇందులో పాన‌కం, మ‌జ్జిగ‌, చ‌లివేంద్రం, వాటర్ కూలర్లు, పోలీస్, మెడికల్ సిబ్బంది ఏర్పాటు .
  • శ్రీ కోదండ‌రామ‌స్వామి వారి ఆల‌యం నుండి క‌ల్యాణ వేదిక వ‌ర‌కు భ‌క్తులు చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో న‌డిచేందుకు వీలుగా  చలువ పందిళ్లు, నీటి పిచుకారి యంత్రాలు ఏర్పాటు.
  • ఆల‌య స‌మీపంలో 3 వేల మంది భ‌క్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్ల‌లో వెళ్ళెందుకు జ‌ర్మ‌న్ షెడ్డు ఏర్పాటు.
  • శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ఈడీ స్క్రీన్ లు.
  • ఆలయం, కల్యాణ వేదిక, పరిసర ప్రాంతాల్లో 38 వివిధ దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు, భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులు ఏర్పాటు.
  •  శ్రీ సీతారాముల క‌ల్యాణం సంద‌ర్భంగా ఏప్రిల్ 1న సాయంత్రం 6 గంట‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.  

నిఘా మ‌రియు భ‌ద్రత

•  టిటిడి విజిలెన్స్ విభాగం, అబ్జర్వేషన్ టీం, ఫైర్ సిబ్బంది 510 మంది, టిటిడి స్కౌట్స్ 200 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం 3,000 మంది సేవలు 

•  అదేవిధంగా 235 సిసి కెమెరాలు, 12 డ్రోన్ లు, కామన్ కమెండ్ కంట్రోల్ సెంటర్,  మరో మూడు  3 స‌బ్ కంట్రోల్ రూమ్ ల నుండి పర్యవేక్షణ. 

•  కళ్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కడప వైపు 13, తిరుపతి వైపు 5 చోట్ల పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు.

దాదాపు 21 కి.మీ మేర లైటింగ్, సూచిక బోర్డులు, మొబైల్ పెట్రోలింగ్‌, ప‌ర్య‌వేక్ష‌ణ టీంలు.

అన్న‌ప్ర‌సాదాలు:

•  బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో, క‌ల్యాణ వేదిక వ‌ద్ద నిరంతరాయంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ.

•  ఇందులో రుచిక‌ర‌మైన అన్నం, సాంబ‌రు, ర‌సం, మ‌జ్జిగ‌, ప‌చ్చ‌డి, క‌ర్రీ, బెల్లం పొంగ‌లి అందిస్తారు.

•  క‌ల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాల‌రీల‌లో వేచి ఉండే భ‌క్తులకు సాయంత్రం నుండి పులిహోర, రవ్వ కేసరి, మైసూర్ పాక్, బిస్కెట్ ప్యాకెట్, కారాసు, అరటిపండు, టిష్యూ పేపర్, ఉడెన్ స్పూన్, 3 లక్షల తాగునీరు బాటిల్స్, వాటర్ ట‌బ్బుల ద్వారా నీటి స‌ర‌ఫ‌రా, 2 లక్షల మ‌జ్జిగ ప్యాకెట్లు, లక్ష టెట్రా ప్యాకెట్లు

ర‌వాణా

•  ఆర్‌టిసి ద్వారా క‌డ‌ప నుండి ఒంటిమిట్ట వ‌ర‌కు 85 బ‌స్సుల‌తో 425 ట్రిప్పులు, రాజంపేట నుండి ఒంటిమిట్ట వ‌ర‌కు 40 బ‌స్సుల‌తో మొత్తం 625 ట్రిప్పుల ద్వారా భ‌క్తుల‌కు ర‌వాణా సౌక‌ర్యం.

•  ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్ ప్రాంతాల నుండి క‌ల్యాణ వేదిక వ‌ర‌కు 20 బ‌స్సులు ఏర్పాటు.

పుష్పాలంక‌ర‌ణ‌లు:

•  కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు.

•  మొదటిసారి ఆలయ ప్రాంగణంలో కళాకృతులుతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశారు.

సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

  శ్రీ సీతా రాముల క‌ల్యాణంలో గోవింద‌నామ స‌ర‌ళిలో శ్రీ రామ‌నామ భ‌జ‌నామృతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.