తెయ్యం (Theyyam) కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతంగా పిలిచే కన్నూర్, కాసరగోడ్ ప్రాంతాల్లో వేల సంవత్సరాల నాటి పురాతన జానపద ఆచార కళ. ఇది 'దైవం' అనే పదం నుండి ఉద్భవించింది, తెయ్యం అంటే దైవం అని అర్ధం. అంటే దేవుని నృత్యం అని అర్థం. తెయ్యంలో కళాకారులు దేవుళ్ళుగా లేదా వీరులుగా మారి, రంగురంగుల దుస్తులు, ముఖచిత్రాలతో నృత్యం చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తారు. తెయ్యం కేవలం కళ మాత్రమే కాదు, ఇది కేరళ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆధ్యాత్మిక నమ్మకాలను ప్రతిబింబించే ఒక పవిత్రమైన ప్రక్రియ.
తెయ్యం చరిత్ర మరియు ప్రాముఖ్యత
తెయ్యం చరిత్ర ద్రావిడ సంస్కృతి కాలానికి చెందినదిగా భావిస్తారు. ఇది సుమారు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న సంప్రదాయం. ఈ ఆచారం ఆర్య సంస్కృతి రాక ముందు నుంచే ఉండేదని ఆ ప్రాంత చరిత్రకారులు చెబుతున్నారు. కాలక్రమేణా ఇది హిందూ సంప్రదాయాలతో కలిసిపోయింది. స్థానిక గిరిజనులు దేవతలను ఆరాధించే విధానం నుండి తెయ్యం అభివృద్ధి చెందింది.
తెయ్యం ఉత్తర కేరళలోని కొలతునాడు ప్రాంతంలో, ముఖ్యంగా తెయ్య, నాయర్ వంటి వర్గాల సాంప్రదాయ కళారూపంగా గుర్తింపు పొందింది. పౌరాణిక నేపథ్యం పరిశీలిస్తే కేరళ భూమిని రక్షించడానికి విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముడు ఉత్తర మలబార్ ప్రజలకు కాళియాట్టం, పురవేళ వంటి ఆచారాలను ప్రసాదించాడని నమ్ముతారు.
తెయ్యం ప్రదర్శనలు సాధారణంగా గ్రామ దేవాలయాలు, స్థానిక పెద్దల ఇళ్ల ఆవరణలోను, ఇంకా "కావు" అనిపిలిచే పవిత్రమైన ప్రాంతాల వద్ద జరుగుతాయి.
తెయ్యం చేసే వ్యక్తి (కోలం) ప్రదర్శనకు ముందు ఉపవాసం, ఏకాంత ధ్యానం, కఠినమైన ఆచారాలను పాటిస్తారు. వేషధారణ తర్వాత, వారు ఆ దేవతగా మారిపోతారని భక్తులు నమ్ముతారు. తెయ్యం ప్రదర్శనలో కళాకారుడుని దేవుడిగా భావించి ప్రజలు అతని దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలాగే అతను ప్రజల సమస్యలకు పరిష్కారాలు కూడా తెలియ చేస్తాడు.
తెయ్యంలో కళాకారులు భారీ ముఖరంగులు, అలంకరణలు, తలపాగా వంటివి ధరించి నృత్యం చేస్తారు. ఈ వేషధారణలు చాలా ఆకర్షణీయంగా ఉండి కొన్ని సార్లు 20–30 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ముఖ్యంగా ప్రదర్శన. కారుడు ధరించే వస్త్రాలు, తలపాగా తెయ్యం లో అత్యంత ముఖ్యమైన భాగాలు.
వెదురు, కొబ్బరి నార, ఆకులు, గడ్డి, గుడ్డలతోను రూపొందిన వేషధారణ ఆకట్టుకునేలా ఉంటుంది. తయారు చేస్తారు. కొన్ని తలపాగాలు 20 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.
కొబ్బరి ఆకులు, బాంబూ, గడ్డి వాడతారు
ముఖానికి రంగులు, ఛాతీ భాగాన ప్రత్యేక అలంకరణలు, ఆభరణాలు, గజ్జెలు ఉంటాయి తెయ్యం ప్రదర్శనకు మరింత ఆరక్షణతో పాటు దైవత్వాన్ని తెచ్చి పెడతాయి. ఇక్కడ ప్రతి తెయ్యం పాత్రకు ప్రత్యేక వేషధారణ ఉంటుంది.
కొన్ని తేయ్యం రూపాల్లో అగ్ని ప్రవేశంగా పిలిచే అగ్నిలో నడక , తీవ్రమైన నృత్యాలు ఉంటాయి.
తెయ్యం సమయంలో కళాకారుడు దైవస్వరూపం పొందాడని నమ్మకం ఉంటుంది.
నవంబర్, డిసెంబర్ మధ్యనుండి నుండి మే వరకు ఉత్తర మలబార్ ప్రాంతంలోని గ్రామాలలో వందలాది తెయ్యం ఉత్సవాలు జరుగుతాయి.
గమనిక: తెయ్యం చూసేటప్పుడు కొన్ని కట్టుబాట్లు పాటించాలి. ఇది పర్యాటక ప్రదర్శన మాత్రమే కాదు, ఒక పవిత్రమైన ఆచారం కాబట్టి భక్తుల నమ్మకాలను గౌరవించడం ముఖ్యం.