శ్రీవారి ఆలయంలో జనవరి 25వ తేదీన నిర్వహించనున్న రథ సప్తమి వేడుకలకు టీటీడీ సర్వం సిద్ధంచేసింది. ఆ రోజున ఒకరోజు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.
రథసప్తమి వాహన సేవల వివరాలు
- సూర్య ప్రభ వాహనం – ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు
- చిన్న శేష వాహనం – ఉదయం 9 నుండి 10 గంటల వరకు
- గరుడ వాహనం – ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
- హనుమంత వాహనం – మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు
- చక్రస్నానం – మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు
- కల్పవృక్ష వాహనం – సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు
- సర్వభూపాల వాహనం – సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు
- చంద్రప్రభ వాహనం – రాత్రి 8 నుండి 9 గంటల వరకు
- జనవరి 25 న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు.
- ఎక్కువమంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు.