అక్టోబరు 07న పౌర్ణమి గరుడ సేవ

 

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబరు 07వ తేదిన పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా నిర్వహించారు.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.