మార్చి 7 నుండి 15వ తేదీ వరకు పుంగ‌నూరు శ్రీ క‌ల్యాణ వెంక‌ట‌ర‌మ‌ణ స్వామివారి బ్రహ్మోత్సవాలు

 

చిత్తూరు జిల్లా పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యాణ వెంక‌ట‌ర‌మ‌ణ స్వామివారి ఆలయంలో మార్చి 7 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 6వ తేదీ సాయంత్రం అంకురార్పణ, సేనాధిప‌తి ఉత్స‌వంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

07-03-2025

ఉద‌యం – ధ్వజారోహణం (మ‌ధ్యాహ్నం 12.25 నుండి 12.45 గంట‌ల వ‌ర‌కు, మిథున ల‌గ్నంలో)

రాత్రి – పెద్ద‌శేష‌వాహనం


08-03-2025

ఉద‌యం – చిన్న‌శేష‌వాహనం

రాత్రి – హంస వాహనం


09-03-2025

ఉద‌యం – సింహ వాహనం

రాత్రి – ముత్య‌పుపందిరి వాహనం


10-03-2025

ఉద‌యం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం

రాత్రి – హ‌నుమంత వాహనం


11-03-2025

ఉద‌యం – మోహినీ ఉత్స‌వం

రాత్రి – గ‌రుడ వాహ‌నం


12-03-2025

ఉద‌యం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం

రాత్రి – చంద్ర‌ప్ర‌భ‌వాహనం


13-03-2025

ఉద‌యం – క‌ల్యాణోత్స‌వం (ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు)

రాత్రి – గ‌జ వాహ‌నం


14-03-2025

ఉద‌యం – రథోత్సవం (ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు)

రాత్రి – అశ్వ వాహ‌నం


15-03-2025

ఉద‌యం – వసంతోత్సవం, చక్రస్నానం (ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట వ‌ర‌కు)

రాత్రి – ధ్వజావరోహణం.


బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 16న ఉద‌యం 10 గంట‌ల‌కు తిరుప్పావ‌డ సేవ‌, రాత్రి 7.30 గంట‌ల‌కు శ‌య‌నోత్స‌వం జరుగనుంది.