నిర్దేశిత సమయంలోనే దర్శనాలకు అనుమతి

తిరుమలలో వైకుంఠ ఏకాదశి పది రోజుల వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు టిటిడి అనుమతిస్తోంది. 

భక్తులు సంయమనం పాటించి తిరుపతిలో జారీ చేయనున్న ఎస్ఎస్ డీ టోకెన్లు పొందాలని టిటిడీ కోరుతోంది.

 వైకుంఠ ఏకాదశికి అధికారులు విస్త్రుత  ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తోంది.