కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు సుమారు 60 కిలోమీటర్లదూరంలోని దొడ్డబళ్ళాపూర్ లో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. ఈ ఆలయం సుమారు 400 ఏళ్ళ క్రితం నిర్మించబడిందని తెలుస్తోంది. టిప్పుసుల్తాన్ కాలంలో హైదర్ ఆలీ అనే ముస్లింరాజు హిందువుల ఆలయాలను ధ్వంశం చేస్తుండేవాడు. అలాంటి రోజుల్లో వారి దాడుల నుంచి రక్షించడానికి ఈ ఆలయాన్ని బైటికి మసీదు ఆకృతి ఉండేలా నిర్మించి లోపల శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి మూర్తిని ప్రతిష్టించినట్లు స్థానికుల సమాచారం. ముస్లింరాజుల దాడులను సైతం ఎదురొడ్డి నిలిచిన ఈ ఆలయంలో మూర్తి ఎంతో సుందరంగా దర్శనమిస్తాడు. కోరినకోర్కెలు తీర్చే దేవుడుగా ప్రసిద్ధి చెంచాడు.
వేంకటరమణుని చరిత్ర
దొడ్డబళ్ళాపూర్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం 17వ శతాబ్దంలో టిప్పుసుల్తాన్ కాలంలో హిందూరాజులచే నిర్మించబడింది. ఈ ఆలయంలో వెలసిన దేవుని స్థానికులు వెంకటరమణ స్వామి అని పిలుచుకుంటారు. మాఘపూర్ణిమ రోజున ఈ ఆలయంలో తేరు ఉత్సవం అంటే రథోత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రతి ఒక్కరూ తప్పక దర్శించవలసిన సుందరమైన ఆలయం. దొడ్డబళ్లాపూర్ లో ఇలాంటి పురాతన ఆలయాలు అనేకం ఉన్నాయి.