తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
- ఫిబ్రవరి 1, 8, 15, 22వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 10న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు.
- ఫిబ్రవరి 13న పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారికి కూపుచంద్రపేట ఉత్సవం వైభవంగా జరుగనుంది.
- ఫిబ్రవరి 28న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఉంది పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.