గత కొన్ని రోజులుగా తిరుమలలో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరుకోవడంతో గోగర్భం డ్యామ్ వద్ద గురువారం టీటీడీ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి సమర్పించారు.
వర్షాలు సమృద్ధిగా కురవడంతో తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం డ్యామ్ లు పూర్తిగా నిండాయి. మరోసారి వర్షం పడితే కుమారధార, పసుపుధార డ్యామ్ లు కూడా నిండిపోతాయి. ప్రస్తుతం తిరుమలలో రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీటి వినియోగ౦ అవుతో౦ది. ప్రస్తుత నీటి నిల్వలు 300 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయి.
గురువారం సాయంత్ర౦ 4 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.
1) పాపవినాశనం డ్యామ్ :- 697.05 మీ.
FRL :- 697.14 మీ.
నిల్వ సామర్థ్యం :- 5240.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 5208.00 లక్షల గ్యాలన్లు.
2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామర్థ్యం :- 2833.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 2833.00 లక్షల గ్యాలన్లు.
3) ఆకాశగంగ డ్యామ్ :- 865.00 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామర్థ్యం :- 685.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 685.00 లక్షల గ్యాలన్లు.
4) కుమారధార డ్యామ్ :- 896.50 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామర్థ్యం :- 4258.98 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 3724.43 లక్షల గ్యాలన్లు.
5) పసుపుధార డ్యామ్ :- 896.50 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామర్థ్యం :- 1287.51 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 966.31 లక్షల గ్యాలన్లు.