మన భారతదేశం ఆధ్యాత్మికంగా ప్రపంచానికే తలమానికం. మన మహర్షులు సూక్ష్మంగానూ, స్థూలంగానూ, జన్మరాహిత్యాన్ని పొందే ముక్తి మార్గం చూపే దీపస్తంభాల వంటివారు. మానవులు పూర్వజన్మల పుణ్య చారిత్రకత వల్ల అటువంటి మునుల శిష్యులై ఆదర్శవంతంగా జీవించి మార్గదర్శకులైనారు. భారతదేశ చరిత్రలో 20వ శతాబ్దంలో కూడా ప్రపంచ ఖ్యాతిని పొందిన వారిలో భగవాన్ రమణ మహర్షి. ఒక సామాన్య మానవుడిగానే తనంత తాను ప్రకటితమవుతూ ఎందరికో మార్గదర్శకులైన రమణ మహర్షి వంటివారు యావత్ భారతావనిలో అత్యంత అరుదు. తోటి భక్తులకు మాత్రం చాలా చిత్రంగా ఆయన గొప్పయోగిలానే కనిపించే వారు.
రమణ మహర్షి ఒక భారతీయ ఋషి. మౌనముద్రలోనే ఆయన తన భోధనలు సాగించేవారు. సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సాధారణ జీవనాన్ని సాగిస్తూ ధర్మ ప్రచారం చేసిన జ్ఞానయోగిగా ఆయన పేరుగాంచారు . డిసెంబరు 30న రమణ మహర్షి జయంతి.
రమణుల జీవిత విశేషాలు
తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు , 16 సంవత్సరాల వయస్సులోమోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలైై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు. బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను “అతియాశ్రమి” గా ప్రకటించుకున్నాారు రమణమహర్షి.
రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది “మౌనము”లేదా “మౌనముద్ర”. వీరు చాలా తక్కు వగా ప్రసంగించేవారు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వాారా మార్గం చూపేవారు. వీరి బోధనలలోవిశ్వజనీనమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది. ఎవరైనా ఉప దేశించమని కోరితే , “స్వీయ శోధన” ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవారు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నాా కూడా అడిగినవారి మనఃస్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవారు.
రమణ మహర్షి జననం
శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాాతి గాం చిన ఈయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవాన్ దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ ‘ఆరుద్ర దర్శనం (పునర్వవసు నక్షత్రము) ‘ నాడు జన్మించారు . శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు . శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు నాగస్వాామి, నాగ సుందరం, ఒక సోదరి అలమేలు. సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసేవాడు.
రమణ మహర్షి బాల్యం
పూర్వాాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవారు. అపారమైన దేహధారుఢ్యం కలిగి ఉండేవారు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవారు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాా సౌకర్యం లేకపోవడం వలన వాళ్ళచిన్నాాన్నసుబ్బయ్యర్ వద్దకు వెళ్ళాారు . రమణులు చిన్ననతనంంలో బాగా నిద్ర పోయేవారు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుుడు తోటి పిల్లలలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు
తెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది.
రమణ గారి తండ్రి చనిపోవడం వల్ల రమణ గారి అన్నగారు నాగస్వాామి రమణులను మధురై తీసుకుని వెళ్ళి పోయాడు. అక్కడ రామస్వాామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళివస్తూండగా రమణులు పలకరింంచి ఎక్కడ నుంచి వస్తున్నాారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుండి అల్లరి చేయడం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశారు.
రమణ మహర్షి బోధనలు
స్వీయ -శోధన ద్వాారా మాత్రమే “జ్ఞాన మార్గము”. వీరు హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను, మార్గాలను కూడా తన బోధనలలో బోధించేవారు.