తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆదివారం కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి కార్తీక దీపం, వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించారు.
శ్రీ కోదండరామాలయంలో
తిరుపతి శ్రీ కోదండరామాలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకొచ్చారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించారు.