సెప్టెంబరు 7న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయ‌క చవితి వేడుక‌లు

 


తిరుప‌తి శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 7న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయ‌క స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్స‌వం నిర్వ‌హిస్తారు.

రెండో ఘాట్ రోడ్డులోని ఆల‌యంలో

రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు మూలవర్లకు అభిషేకం నిర్వ‌హిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి.