ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వరకు బాలాలయం జరుగనుంది. ఇందుకోసం సెప్టెంబర్ 6న సాయంత్రం 5.30 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపట్టాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగువరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.
ఆలయంలోని యాగశాలలో సెప్టెంబర్ 7, 8వ తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 9.30 నుంచి 10. 30 గంటల మధ్య తులా లగ్నంలో బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు.