కార్వేటినగరంలో కన్నులపండువగా బ్రహ్మోత్సవాలు

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

సూర్యప్రభ వాహన సేవ

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన‌ మంగళవారం ఉదయం 7:30 గంటలకు సూర్యప్రభ వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి భక్తులను కటాక్షించారు.

మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

వేణుగోపాలుడి రథోత్సవం

ఎనిమిదవ రోజైన‌ బుధవారం ఉదయం 7:30 గంటలకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది.

మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా రథోత్సవం జరిగింది.

అశ్వవాహన సేవ

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన‌ బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామివారు అశ్వ వాహనంపై భక్తులను కటాక్షించారు.

మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహన సేవ వైభవంగా జరిగింది.

వేణుగోపాలుని చక్రస్నానం

కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా గురువారం ఉదయం చక్రస్నానం వైభ‌వంగా నిర్వ‌హించారు.

ఉద‌యం 8 నుండి 9.15 గంటల వ‌ర‌కు ఆలయ స‌మీపంలోని స్కంధ పుష్క‌రిణిలో అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనల‌తో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.

సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసాయి.