తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ( శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.
ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7 నుండి 8 గంటల వరకు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు పెద్దమాడవీధి ఉత్సవం నిర్వహించారు. ఉదయం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.