తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో రెండవ రోజైన గురువారం నెమలి ఈకలు, గాజులు, ముత్యాలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలతో స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.
మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లకు శుక్రవారపు తోటలో వేదమంత్రాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, కుంకుమ, చందనంలతో అభిషేకం చేశారు.
రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.