శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణంతో ముగిశాయి.
సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.