శ్రీవారి దర్శనానికి టీటీడీ మాజీ బోర్డు సభ్యులు నిబంధనలు పాటించాలి

 

టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే వారి కుటుంబ సభ్యులతో (భార్య, పిల్లలతో , తల్లి తండ్రి ) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం టిటిడి బోర్డు కల్పించింది. 

అయితే కొందరు మాజీ బోర్డు సభ్యులు ఈ నిబంధనకు విరుద్ధంగా తమ కుటుంబ సభ్యులతో కాకుండా ఇతరులను వెంట బెట్టుకొని శ్రీవారి దర్శనం కొరకు పదే పదే వస్తున్నారు.  టిటిడి   మాజీ బోర్డు సభ్యులు ఆ హోదాలో కేవలం వారి కుటుంబ సభ్యులతో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలే తప్ప, ఇతరులను వెంట బెట్టుకుని వస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదని టిటిడీ స్పష్టంగా పేర్కొంది.