శ్రీవారి ఆశీస్సులతో ధార్మిక సదస్సు విజయవంతం

 

తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సుకు 57 మంది స్వామీజీలను ఆహ్వానించగా అందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుగ్రహభాషణం అందించారని, ఈ విధంగా సదస్సు విజయవంతమైందని టీటీడీ తెలిపింది.

స్వామివారి ఆశీస్సులతో నభూతో నభవిష్యతి అన్నట్టుగా ధార్మిక సదస్సు జరిగింది.  ధార్మిక  సదస్సులో శనివారం 24 మంది మహనీయులు, ఆదివారం 17 మంది మహనీయలు ప్రత్యక్షంగా, 16 మంది వర్చువల్ గా తమ సూచనలు, సలహాలు అందించారు. మఠాధిపతులు, పీఠాధిపతులు తమ కీలక సలహాలు, సూచనలిచ్చి టీటీడీకి దిశా నిర్దేశం చేశారు. మహనీయుల ఉపన్యాసాలను రికార్డ్ చేశామని, వీటిని తీర్మానాలుగా చేసి రేపటి రోజున మఠాధిపతులు, పీఠాధిపతులు సమక్షంలో ప్రవేశపెట్టి, వచ్చే బోర్డు సమావేశంలో వీటిని ఆమోదించి తదుపరి కార్యాచరణ చేపడతామని టీటీడీ అధికారులు తెలిపారు.