కవిగా, రచయితగా, తాళపత్ర పరిశోధకుడిగా తెలుగు సాహితీరంగంలో తనదైన ముద్ర వేసిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 136వ జయంతిని ఎస్‌వి ఓరియంటల్ కళాశాలలో బుధవారం నిర్వహించారు.
తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన శ్రీ ప్రభాకరశాస్త్రిని వక్తలు కొనియాడారు. ఉన్నతమైన సాహితీ విలువలను, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు.
శ్రీ వేటూరి విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ ప్రభాకరశాస్త్రి విగ్రహానికికూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.