శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు ప్రారంభం


 తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రారంభమైన శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు  13వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి.

ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం చేపట్టారు. ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు.  ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఏడు రోజుల పాటు జరుగుతున్నాయి.