అయోధ్య ప్రతిష్టాపనకోసం అత్తింటినుంచి సారె

శ్రీరాముని భార్య జానకి మాత జన్మస్థలం నేపాల్ దేశం జనక్‌పూర్‌లోని జానకి ఆలయం అయోధ్య రామ ప్రతిష్ఠా కార్యక్రమాల్లో, సాంస్కృతిక, మతపరమైన ఉత్సవాలతో వేడుకలలో పాల్గొనడానికి సర్వాంగసుందరంగా సిద్ధమయింది. జనకమహారాజు కుమార్తె అయిన సీతాదేవి నివాస స్థలమైన  జనక్‌పూర్ నుంచి అయోధ్యకు రకరకాల విలువైన వస్తువులను సారెగా పంపించారు జనక్‌పూర్ భక్తులు.  

వైభవోపేతంగా ఏర్పాట్లు  

జనక్‌పూర్‌లోని ఇళ్లు మరియు వీధులు రంగురంగుల లైట్లు, పేపర్ జెండాలు, బ్యానర్లు మరియు దండలతో అలంకరించబడ్డాయి.

దాదాపు మూడు వారాల క్రితం, వెదురుతో తయారు చేసిన 3,000 పళ్ళాలతో సీతమ్మవారి సారెతో  గొప్ప ఊరేగింపుజనక్‌పూర్ నుండి అయోధ్యకు తరలివెళ్ళింది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పళ్ళాలలో బంగారు, వెండి ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు, స్వీట్లు, పండ్లు, రకరకాల నిత్యోపయోగ వస్తువులను అయోధ్యకు తరలించారు జనక్ పురి భక్తులు. 

21 మంది వ్యక్తులతో కూడిన రామభక్తులు, 'ప్రాణ ప్రతిష్ట' లేదా విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొనేందుకు అయోధ్యకు తరలివెళ్తున్నారు.