చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లి గ్రామంలోని రాజనాలబండ శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి మరియు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని గురువారం టీటీడీ ఆధీనంలోకి తీసుకుంది.
ఈ మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆలయ పత్రాలను టీటీడీ డెప్యూటీ ఈవోకు అందజేశారు. ఈ ఆలయాన్ని పుంగనూరు గ్రూపు ఆలయాల పరిధిలోకి తీసుకున్నారు.