తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం గోదా పరిణయోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం 4 నుండి 6.30 గంటల వరకు ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయంవద్ద శ్రీకృష్ణ స్వామి వారికి, గోదాదేవి అమ్మవారికి పరిణయోత్సవం నిర్వహించారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 17న పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సాయంత్రం 4 నుండి 6.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మవారిని రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఆస్థానం నిర్వహించి తిరిగి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుంటున్నారు
.