తిరుమలలో యువతకు బ్రేక్ దర్శనం

యువతకు శ్రీవారి బ్రేక్ దర్శనం పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. యువతలో హైందవ ధర్మవ్యాప్తి కోసం 25 ఏళ్లలోపు వారికి రామకోటి తరహాలో గోవింద కోటి పుస్తకాలను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. 200 పేజీల పుస్తకం ధర రూ 111 గా నిర్ణయించారు. మొత్తం 26 పుస్తకాల్లో 10,01,116 సార్లు గోవింద నామాలు రాసిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తారు.

253 గోవింద కోటి పుస్తకాల్లో కోటీ సార్లు రాసిన వారికి కుటుంబసభ్యులు అయిదుగురితో శ్రీవారి బ్రేక్ దర్శనం, వసతి కల్పించాలని నిర్ణయించారు. తెలుగు, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 20 పేజీలతో ముద్రించిన 20 వేల పుస్తకాలను ఆయా రాష్ట్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు.