అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ఈ నేపధ్యంలో టీటీడీ భక్తుల సౌకర్యార్ధం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 

బ్రహ్మోత్సవాల వివరాలు

సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 

వార్షిక బ్రహ్మోత్సవాల్లో  భాగంగా...

  • సెప్టెంబర్ 18న ధ్వజారోహణం 
  • సెప్టెంబర్ 22న గరుడ సేవ, 
  • సెప్టెంబర్23న స్వర్ణరథం, 
  • సెప్టెంబర్ 25న రథోత్సవం, 
  • సెప్టెంబర్ 26న చక్రస్నానం,  ధ్వజవరోహణం

నవరాత్రి బ్రహ్మోత్సవాలు

  •  అక్టోబర్ 15న ధ్వజారోహణం
  •  అక్టోబర్ 19న గరుడవాహనం, 
  •  అక్టోబర్22న స్వర్ణరథం, 
  •  అక్టోబర్ 23న చక్రస్నానం

పురటాసి మాసం 

పురటాసి మాసం, రెండు బ్రహ్మోత్సవాలు కలిసినందున, ఈ సంవత్సరం భారీ యాత్రికుల రద్దీ ఉంటుంది.  పురటాసి పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. సెప్టెంబరు 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు జరుగుతాయి.  ఈ రెండు బ్రహ్మోత్సవాలు , పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు టీటీడీ అధికారులు.