శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వేడుకగా ఆడికృత్తిక

 

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం ఆడికృత్తిక పర్వదినం వేడుకగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం జరిగింది. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం కన్నులపండుగగా నిర్వహించారు.