వైభవంగా సాగుతున్న శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం

తిరుమ‌ల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమానికి 12వ తేదీ సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వహించారు. 

ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ఆచార్యవరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం చేశారు.

ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో డిసెంబరు 13 నుండి ప్రారంభమైన ఈ హోమాన్ని 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొత్తం 22 మంది ఋత్వికులు శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం నిర్వ‌హణలో పాల్గొంటున్నారు.

ప్రతిరోజూ ఉదయం 9 నుండి 12 గంటల వ‌ర‌కు, సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.