గణేశ జయంతి నాడు గణపతిని పూజించండి

శ్రీ గణేశుడు మాఘ మాస శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు జన్మించాడు. అందుకే మనమంతా ఈరోజున గణేశ జయంతి ఘనంగా జరుపుకుంటాము.ఈ సంవత్సరం గణేశ జయంతి జనవరి 25 శుక్రవారం అంటే మాఘమాస శుక్ల పక్షంలోని చతుర్థి నాడు చోటుచేసుకుంది.  ఈ రోజు గణేశ జయంతి వ్రతాన్ని ఆచరించడం, గణపతిని పూజించడం ద్వారా, కోరికలు నెరవేరుతాయి, ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయి, ఆటంకాలు ,ఇబ్బందులు తొలగిపోతాయి. పనిలో విజయం సాధిస్తారు. గణేశ జయంతి వ్రతం, పూజ విధి గురించి తెలుసుకుందాం.

చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతిని పూజించడం ద్వారా ఆయన సంతోషించి భక్తుల బాధలను దూరం చేస్తాడు. వారి జీవితంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. గణపతి అనుగ్రహం వల్ల సంతోషం, శ్రేయస్సు, విజయం లభిస్తాయి. ఈ పార్వతి సుతుడు ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని ప్రసాదించేవాడు. గణేశ జయంతి రోజున ఆ సులభమైన జ్యోతిష్య చిట్కాల గురించి తెలుసుకుందాం.

  • 1. గణేశ జయంతి రోజున ఆయనకు ఇష్టమైన వస్తువులను నివేదించాలి. ఇది వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. గణేశునికి మోదకం అంటే చాలా ఇష్టం, కాబట్టి మీరు గణపతికి మోదకాలు సమర్పించాలి.
  • 2. గణేశునికి గరిక చాలా ఇష్టం గణేశ జయంతి రోజున ఆయనకు 21 గరిక ముడులను కూడా సమర్పించాలి. ఇందువల్ల మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
  • 3. గణేశ జయంతి  సందర్భంగా, ఉదయం స్నానం చేసిన తర్వాత, గణేశ చాలీసాను స్వచ్ఛమైన హృదయంతో పఠించండి. గణేశునికి హారతి ఇవ్వండి.  మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు .అదృష్టాన్ని ప్రసాదిస్తారు.
  • 4. మీరు ఏదైనా సమస్యలో ఉన్నట్లయితే లేదా మీకు హాని కలిగించే అటువంటి సమస్య ఏదైనా ఉంటే, దీనిని నివారించడానికి, గణేశ జయంతి రోజున పూజించే సమయంలో గణేశ కవచాన్ని చదవండి.
  • 5. దేవుళ్ల వాహనాలు, వాటి చిహ్నాలను పూజించడం ద్వారా దేవతలు కూడా సంతోషిస్తారు. గణేశ జయంతి రోజున, ఏనుగులు, ఎలుకలకు ఆహారం ఇవ్వండి, వాటికి భోజనం పెట్టండి. వినాయకుని అనుగ్రహంతో మీ జీవితం సంతోషంగా ఉంటుంది.
  • 6. గణేశ జయంతి సందర్భంగా, పార్వతీ దేవి, శివుడు ఉన్న గణేశుడి చిత్రం లేదా విగ్రహాన్ని పూజించండి. మీ తల్లిదండ్రులకు సేవ చేయండి. గణేశుడు మీ పట్ల సంతోషించి, మీ కోరికలను నెరవేరుస్తారు.