తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నాడు సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.
వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగాలను సూచిస్తూ శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హనుమంతుని ప్రతిమలను పల్లకీపై కొలువుదీర్చారు. ఐదు టన్నుల వివిధ రకాల సంప్రదాయ పుష్పాలతో సుందరంగా అలంకరించిన పల్లకిపై స్వామి దర్శనమిచ్చారు.