గణపతి రూపాలు: మహా మహిమాన్వితమైనవి గణపతి రూపాలు

మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతినే కొలుస్తుంటాం. ఏ గణానికైనా అతడే 'పతి' జగత్తు. ఎందుకంటే అంతా 'గణ' మయమే కాబట్టి ! వివిధ గణ సమాహారమే ఈ విశ్వమని మనకు ఎన్నో పురాణాలు చెబుతుంటాయి. 'గ' అనే అక్షరం నుంచే జగత్తు జనించింది.

మనలో చాలామందికి వినాయకుడు అంటే ఒక దేవుడు అని శివపార్వతుల కొడుకని మాత్రమే తెలుసు కాని '' వినాయకుడు '' అనే పదానికి ఒక అర్థం ఉంది.  ఆ అర్థం ఏమిటంటే '' నాయకుడు లేనివాడు '' అని అర్థం. అంటే తనకు తనే నాయకుడు అని. వివిధ ఆగమ శాస్త్రాల్లో గణపతి రూపాలను వివిధ రకాలుగా వివరించారు ఋషులు. 

ముద్గల పురాణం

ముద్గల పురాణాన్ని అనుసరించి 32 రకాల గణపతులు ఉన్నారు. 1. బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి 5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధ గణపతి 8.ఉచ్చిష్ట గణపతి 9.విఘ్న గణపతి 10.క్షిప్ర గణపతి 11.హేరంబ గణపతి 12.లక్ష్మీ గణపతి 13.మహా గణపతి 14. విజయ గణపతి 15.వృత్త గణపతి 16. ఊర్ద్వ గణపతి 17.ఏకాక్షర గణపతి 18.వర గణపతి 19.త్ర్యక్షర గణపతి 20.క్షిప్ర ప్రసాద గణపతి 21.హరిద్రా గణపతి 22.ఏకదంత గణపతి 23.సృష్టి గణపతి 24.ఉద్ధండ గణపతి 25.ఋణ మోచన గణపతి 26.దుండి గణపతి 27.ద్విముఖ గణపతి 28.త్రిముఖ గణపతి 29.సింహ గణపతి 30.యోగ గణపతి 31.దుర్గా గణపతి 32 .సంకష్ట గణపతి

షోడశ గణపతులు

 గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని "షోడశ'' గణపతులు అంటారు.

నంజనగూడు దేవాలయంలో ఉన్న 32 గణపతి విగ్రహాల పేర్లలో 15 పేర్లు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న పేర్లతో సరిపోలుతున్నాయి. తక్కినవి వేరుగా ఉన్నాయి. ఈ అంశాన్ని మైసూరు ప్రాచ్య పరిశోధనా సంస్థ వెల్లడించిన నివేదిక కూడా పేర్కొంది.

విద్యార్ణవ తంత్రం

విద్యార్ణవ తంత్రంలో గణపతి రూపాల్లో 15 విభేదాలు కనిపిస్తాయి.

1. ఏకాక్షర గణపతి 2.మహా గణపతి 3. క్షిప్ర గణపతి

4. వక్రతుండ గణపతి 5. లక్ష్మీ గణపతి 6. హేరంబ గణపతి

7. వీర గణపతి 8.లక్ష్మీ గణపతి 9. శక్తి గణపతి

10. సుబ్రహ్మణ్య గణపతి 11. మహా గణపతి 12. త్రైలోక్య గణపతి

13. హరిద్రా గణపతి 14. వక్రతుండ గణపతి 15. ఉచ్చిష్ట గణపతి

ఇందులో రెండు మహా గణపతులు ఉన్నాయి. కాగా మూడు లక్షణాలు ఉన్న గణపతులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ గణపతులు రెండు, వక్రతుండ గణపతులు రెండు, శక్తి గణపతి లక్షణాలు అయిదు, త్రైలోక్య మోహన గణపతి లక్షణాలు రెండు, వీర గణపతి లక్షణాలు రెండు, ఉచ్చిష్ట గణపతి లక్షణాలు రెండు స్పష్టమౌతున్నాయి.

శిల్ప , ఆగమ శాస్త్రాలు

శిల్ప ఆగమ శాస్త్రాలను అనుసరించి 21 గణపతుల రూపాలు ఉన్నాయి. అవి వరుసగా...

1.వినాయకుడు 2.బీజ గణపతి 3.హేరంబ గణపతి 4.వక్రతుండ గణపతి

5.బాల గణపతి 6.తరుణ గణపతి 7.భక్తి విఘ్నేశ 8.వీర విఘ్నేశ 9.శక్తి గణేశ

10.ధ్వజ గణపతి 11.పింగళ గణపతి 12. ఉచ్చిష్ట గణపతి 13. విఘ్నరాజ గణపతి

14.లక్ష్మీ గణేశ 15.మహా గణేశ 16. భువనేశ గణపతి 17.నృత్త గణపతి

18.ఊర్ద్వ గణపతి 19.ప్రసన్న గణపతి 20.ఉన్మత్త వినాయక 21.హరిద్రా గణేశ