తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవం మంగళవారం ప్రారంభమైంది. మే 4న భోగి తేరు, మే 5న సాత్తుమొర జరుగనున్నాయి.
ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం భాష్యకార్ల వారికి బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం(నాలుగు మాడ వీధులు) జరిగింది. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాత్తుమొర, ఆస్థానం జరిగింది. సాయంత్రం పెద్దమాడ వీధి ఉత్సవం(కర్ణాల వీధి, గాంధీ రోడ్ మీదుగా) చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి పాల్గొన్నారు.