తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి అష్టబంధన మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్ఫణ నిర్వహించారు.
ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటలకు భగవత్ ప్రార్థన, సంకల్పం, ఆచార్య రుత్విక్ వరణం, విష్వక్సేన పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం జరిగింది.
ఏప్రిల్ 11 నుండి 15వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు విశేష హోమాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 9 గంటలకు అష్టబంధనం, ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు మహాశాంతి అభిషేకం, పూర్ణాహూతి నిర్వహిస్తారు.
ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు మహా సంప్రొక్షణ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, రుత్వికులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.