ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు వాల్మీకిపురం శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు


టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు జరుగనున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు

                    తేదీ                                                 ఉదయం                     రాత్రి

  • 06-04-2022(బుధ‌వారం)      ధ్వజారోహణం(మేష ల‌గ్నం), గజవాహనం

  • 07-04-2022(గురువారం)   ముత్యపుపందిరి వాహనం, హనుమంత వాహనం

  • 08-04-2022(శుక్ర‌వారం)       కల్పవృక్ష వాహనం, సింహ వాహనం

  • 09-04-2022(శ‌నివారం)      సర్వభూపాలవాహనం, పెద్దశేష వాహనం

  • 10-04-2022(ఆదివారం)      సూర్యప్రభ వాహనం, చంద్రప్రభవాహనం, మోహినీ అవతారం

  • 11-04-2022(సోమ‌వారం)          తిరుచ్చి ఉత్సవం, కల్యాణోత్సవం, గరుడ వాహనం

  • 12-04-2022(మంగ‌ళ‌వారం)         రథోత్సవం, ధూళి ఉత్సవం

  • 13-04-2020(బుధ‌వారం)         తిరుచ్చి ఉత్సవం, అశ్వవాహనం, పార్వేట ఉత్సవం

  • 14-04-2022(గురువారం)      వసంతోత్సవం, చక్రస్నానం, హంస వాహనం, ధ్వజావరోహణం.