తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో వాహనసేవ ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా జరిగింది.
చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటిసూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మయామోహాందకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి, భక్తులకు సంసారతాపాన్ని తొలగిస్తున్నాడు.
కాగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగనుంది.